రక్షణ రంగంలో మరో అడుగు: విజయవంతంగా ప్రలయ్ క్షిపణి ప్రయోగం

రిపోర్టర్: నరేష్ స్థలం: ఒడిశా

దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రలయ్ క్వాసి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అధికారులు స్పష్టం చేశారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి గురువారం ఉదయం ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపారు. శత్రువుల గుండెల్ లో వణుకు పుట్టించే ఈ సరికొత్త క్షిపణి వివిధ సాంప్రదాయ పేలుడు పదార్థాలను మోసుకెళ్లే అత్యాధునిక సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.