మహమ్మద్ షమీ ఎంపికకు వయసు అడ్డంకి కాదు: ఆకాశ్ చోప్రా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
భారత పేసర్ మహమ్మద్ షమీని వయసు కారణంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదనే ప్రచారాన్ని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఖండించారు. రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నప్పుడు షమీ విషయంలో వయసును చూపడం సరికాదని పేర్కొన్నారు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల వల్లే అతను దూరమయ్యాడని స్పష్టం చేశారు.