సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి: ఆర్డీవోకు మాజీ ఎమ్మెల్యే వినతి
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ నాయకులతో కలిసి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాల కింద నియోజకవర్గంలో సుమారు ₹990 కోట్ల మేర బకాయిలు పడ్డారని ఆరోపించారు. బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.