పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు
రిపోర్టర్: నరేష్
స్థలం: Amaravati
ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలు, తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఒక్క రైతు కూడా నష్ట పరిహారం నమోదు నుంచి మిగిలిపోకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. బాధిత రైతులందరినీ ప్రభుత్వమే ఆదుకుంటుందని ఆయన భరోసానిచ్చారు.