బ్రిక్స్ సమ్మిట్ వేళ ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా సుమారు 30 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. భారత్ మండపం వద్ద ఎస్పీజీ, ఎన్ఎస్జీ బలగాలు రంగంలోకి దిగాయి. వీవీఐపీల రాకపోకల కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.