కొలీజియం వ్యవస్థపై మాజీ జస్టిస్ ఓకా సంచలన వ్యాఖ్యలు: పారదర్శకత కావాలని డిమాండ్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం ప్రధాన జస్టిస్ కేంద్రీకృతంగానే మారిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల కేటాయింపు మరియు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.