మత్స్యకార కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిలదీత

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాసలో మువ్వల నగేశ్ కుటుంబానికి వంద రోజుల్లో న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి నారా లోకేష్ను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి నగేశ్ మృతి చెంది రెండు వేలకు పైగా రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంపై మత్స్యకార సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.