విజయవాడలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: కృష్ణానదిలో కనువిందు చేసిన హంసవాహనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కృష్ణానదిలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. విద్యుద్దీపాల వెలుగుల్లో రంగురంగుల పుష్పాలతో అలంకరించిన హంసవాహనంపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి కృష్ణానది జలాల్లో ఊరేగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వల నడుమ హంసవాహనం నదీ తరంగాలపై సాగుతుంటే భక్తులు పరవశించిపోయారని నిర్వాహకులు పేర్కొన్నారు.