రేపటితో ముగియనున్న జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నాల్గు గంటల ముందే ప్రచారం ఆపాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు వెంటనే ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు.