ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ముప్పు: సంచలన వ్యాఖ్యలు చేసిన నెతన్యాహు
రిపోర్టర్: రాము
స్థలం: Tel Aviv
ఇరాన్ పై మళ్లీ యుద్ధం ప్రారంభించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో ఇరాన్ ముప్పును పూర్తిగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు ఐక్యంగా నిలవాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.