ఏటీపీ టాప్ 10 నుంచి బిగ్ త్రీ పూర్తిగా ఔట్

రిపోర్టర్: అశోక్ స్థలం: World

అంతర్జాతీయ టెన్నిస్‌లో సుదీర్ఘ శకానికి తెరపడింది. ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్‌లలో ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించడంతో జకోవిచ్ 12వ స్థానానికి పడిపోయాడు. దీనితో 2002 అక్టోబర్ తర్వాత పురుషుల టెన్నిస్ టాప్ 10లో బిగ్ త్రీ సభ్యులు లేకపోవడం ఇదే మొదటిసారి.