టెక్నాలజీ దుర్వినియోగం: దేవర పాట మార్ఫింగ్‌పై జాన్వికపూర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను ఏఐ సహాయంతో మార్ఫింగ్ చేయడంపై కథానాయిక జాన్వికపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికతను నేరపూరితంగా దుర్వినియోగం చేసి మహిళలను అభ్యంతరకరంగా చూపించడం లైంగిక దాడితో సమానమని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ ప్రపంచంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.