స్థానిక ఎన్నికల వ్యూహాలపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల అంశంపై కూటమి నేతలు ప్రధానంగా చర్చించారు. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, మేయర్ అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు ఒక స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.