రహస్య క్వారీ హియరింగ్పై భగ్గుమన్న బోదులబండ గ్రామస్తులు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
నేలకొండపల్లి మండలం బోదులబండలో గ్రానైట్ క్వారీ ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా హియరింగ్ నిర్వహించారని ఆరోపించారు. దీనివల్ల తాగునీటి సమస్యతో పాటు ఇళ్లకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన చెందారు. తక్షణమే ఈ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి నిబంధనల ప్రకారం మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.