ఎన్ఎఫ్ఎల్ చరిత్రలో నయా రికార్డ్ సృష్టించిన ట్రావిస్ కెల్సే

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమెరికా

కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ టైట్ ఎండ్ ట్రావిస్ కెల్సే ఎన్ఎఫ్ఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియానాపోలిస్ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్షల్ ఫాల్క్ రికార్డును బ్రేక్ చేస్తూ కెరీర్‌లో అత్యధిక యార్డ్స్ ఆఫ్టర్ ది క్యాచ్ సాధించిన ఆల్ టైమ్ లీడర్‌గా కెల్సే నిలిచారు. తన అద్భుతమైన బ్యాలెన్స్, బలం, ఫీల్డ్ అవగాహనతో సాధారణ పాస్‌లను కూడా పెద్ద గేన్లుగా మారుస్తూ కెల్సే ఈ మైలురాయిని అందుకున్నారు.