వి విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. జాతీయ రహదారిపై లారీని వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, మరొక ప్రమాదంలో రోడ్డు దాటుతుండగా మినీ వ్యాన్ డీకొని మరొకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని, ఈ ఘటనలపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ దుర్గాప్రసాద్ మరియు ఎస్సై రమేష్ తెలిపారు.