ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, క్లీనర్ మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస సెలవులతో సొంతూళ్లకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.