అటవీ భూములు వన్యప్రాణుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
రిపోర్టర్: రాము
స్థలం: కరీంనగర్
జిల్లాలోని అటవీ భూములు మరియు వన్యప్రాణుల పరిరక్షణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అటవీ శాఖ, వన్యప్రాణుల ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా సరిహద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనింగ్ అనుమతులు, చెక్‌పోస్టుల ఏర్పాటుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎల్ఎండీ వద్ద పక్షుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ సత్యనారాయణ తెలిపారు.