ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాకు డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఎంపీలు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.