ఎల్నినో, కరువు పరిస్థితులపై సచివాలయంలో కీలక అఖిలపక్ష సమావేశం నిర్వహణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: సూర్యాపేట

రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావం మరియు తీవ్ర కరువు పరిస్థితులపై సచివాలయంలో అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యామ్నాయ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై ప్రజా ప్రతినిధులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.