శ్రీకాకుళంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీహరి, భాస్కర్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, మద్యం తాగి నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.