కొత్తవలసలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ద్విచక్ర వాహనాన్ని ఢీకొని వ్యక్తి మృతి
రిపోర్టర్: రాము
స్థలం: కొత్తవలస
విజయనగరం జిల్లా కొత్తవలస - విజయనగరం ప్రధాన రహదారిపై గొల్లపేట కూడలి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థానపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సముద్రం బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు అదుపుతప్పి కారును కూడా ఢీకొందని కొత్తవలస పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.