స్పెషల్ సెలబ్రేషన్ రహస్యం: గర్ల్‌ఫ్రెండ్ కు అంకితమిచ్చినట్లు తెలిపిన అర్ష్‌దీప్ సింగ్
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆక్లాండ్
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో తన వినూత్న సెలబ్రేషన్ వెనుక ఉన్న రహస్యాన్ని భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా వెల్లడించారు. వికెట్ తీసిన ప్రతిసారీ తాను చేసిన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టెప్పులను తన గర్ల్‌ఫ్రెండ్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు లేదా మూడ్ బాగోలేనప్పుడు ఈ స్టెప్పులు వేస్తుంటామని, ఈ మ్యాచ్‌లోనూ అదే రీతిలో సంబరాలు చేసుకున్నానని అర్ష్‌దీప్ సింగ్ స్పష్టం చేశారు.