అమెరికా దివాళా తీసే ప్రమాదం ఉందంటూ ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: Washington

అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు తెలిపారు. పెరుగుతున్న జాతీయ రుణం, భారీ వడ్డీ భారం కారణంగా దేశం భవిష్యత్తులో దివాళా తీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ సాంకేతికతలు మాత్రమే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించగలవని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితిపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.