అహ్మదాబాద్‌లో షోలకు అనుమతి ఇవ్వండి: కమెడియన్ సమయ్ రైనా వేడుకోలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గుజరాత్

ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా అహ్మదాబాద్‌లో తన షోలకు అనుమతి నిరాకరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా అనుమతులు రావడం లేదని, గుజరాత్‌లో ప్రదర్శనలు ఇవ్వడం తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్ అధికారులను ఉద్దేశించి చేతులు జోడించి మరీ అనుమతి ఇవ్వాలని కోరారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.