జూరాల ఆయకట్టు సాగునీటి సమస్యపై రైతుల ఆందోళన తీవ్రత

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు రోడ్డెక్కుతుంటే, వారి సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న బీజేపీ నేత ఎన్. రామచంద్రరావును జడ్చర్లలో పోలీసులు అడ్డుకోవడంపై జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం చూపాల్సింది పోయి, రైతుల పక్షాన నిలిచే నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.