చంద్రబాబును కలిసిన బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ కి ఆహ్వానం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 22న నిర్వహించనున్న అలయ్-బలయ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల ఐక్యత, పరస్పర సహకారంపై చర్చించారు. ఈ వేడుకకు వస్తానని చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.