జలదిగ్బంధం కాకుండా వినాయక నిమజ్జనంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వినాయక నిమజ్జనాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై శివ రాకేష్ సూచించారు. నదులు, వాగులు, చెరువుల వద్ద నిమజ్జన సమయంలో చిన్నారులు, వృద్ధులు నీటి ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు సూర్యాస్తమయానికి ముందే నిమజ్జనం పూర్తి చేయాలని, భారీ విగ్రహాల తరలింపులో భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి హంగామా చేయరాదని, నిషేధిత డీజేలను వినియోగించవద్దని హెచ్చరించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.