ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, కలెక్టరేట్లో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతుల ప్రదానం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.