నీట్ పరీక్షలో అద్భుత ప్రతిభతో మెడికల్ సీటు సాధించిన విద్యార్థి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్ పూర్వ విద్యార్థి ప్రజ్ఞాన్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే నీట్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 293వ ర్యాంకు సాధించి సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల చైర్మన్ చుక్క అల్లాజీ ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని యాజమాన్యం తెలిపారు.