హాలీవుడ్ లెజెండ్ ఎల్విస్ ప్రెస్లీ విలాసవంతమైన ఇల్లు ఇప్పుడు అద్దెకు అందుబాటులో ఉంది

రిపోర్టర్: గోపి స్థలం: Los Angeles

ప్రముఖ హాలీవుడ్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ మరియు ఆయన భార్య ప్రిస్సిల్లా ప్రెస్లీ నివసించిన చారిత్రాత్మక విలాసవంతమైన ఇల్లు తాజాగా అద్దెకు అందుబాటులోకి వచ్చినట్లు రిపోర్టులు వెల్లడించాయి. లాస్ ఏంజిల్స్ లోని బెవర్లీ హిల్స్ లో ఉన్న ఈ అద్భుతమైన భవనాన్ని నెలకు ముప్ పై ఐదు వేల డాలర్ల అద్దెకు కేటాయించినట్లు తాజా సమాచారం ద్వారా స్పష్టమైంది. ఈ భవనం గతంలో పలుమార్లు చేతులు మారుతూ వచ్చిందని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొన్నాయి.