విజయనగరం రూరల్: వైభవంగా పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోందని, సోమవారం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని అధికారులు తెలిపారు. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఘటాలు సమర్పించుకున్నారని, నగర వీధులన్నీ జనసంద్రాన్ని తలపించాయని పేర్కొన్నారు. నగరం అంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోందని, హుకుంపేటలో సిరిమానుకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారని వెల్లడించారు.