యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన పేటీఎం
రిపోర్టర్: అశోక్
స్థలం: భారతదేశం
యూజర్ల సౌలభ్యం కోసం ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పలు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు తమ మొత్తం బ్యాలెన్స్‌ను ఒకే చోట చూసుకునేలా టోటల్ బ్యాలెన్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. అలాగే లావాదేవీల గోప్యత కోసం హైడ్ పేమెంట్స్ ఆప్షన్‌తో పాటు నెలవారీ స్టేట్‌మెంట్‌లను పిడిఎఫ్ లేదా ఎక్సెల్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.