నిజామాబాద్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
రిపోర్టర్: రాము
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన ఏఆర్ ఆర్ఎస్సై హనుమకొండ సతీష్ శుక్రవారం సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు, పై అధికారుల ఒత్తిడి కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా, ఈ ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.