భారత్ తో మ్యాచ్ కోసం పనామా జట్టు ప్రకటన

రిపోర్టర్: వెంకట్ స్థలం: Bengaluru

ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్ విండోలో భాగంగా బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో సెప్టెంబర్ 25న భారత్‌తో తలపడేందుకు కోచ్ థామస్ క్రిస్టియన్‌సెన్ నేతృత్వంలో పనామా బలమైన 27 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టూర్ కోసం పనామా జట్టులో 14 మంది ప్రపంచ కప్ ఆటగాళ్లతో పాటు ఆరుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఖద్ జమీల్ శిక్షణలోని భారత జట్టుతో జరిగే ఈ మ్యాచ్ కోసం పనామా ఆటగాళ్లు వేర్వేరు దేశాల నుంచి మూడు విడతలుగా భారత్‌కు చేరుకోనున్నారు.