విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల వేళ నకిలీ టికెట్ల కలకలం
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు నకిలీ టికెట్ల విక్రయాలకు పాల్పడుతున్నాయి. కావలి ప్రాంతానికి చెందిన ఒక మహిళా భక్తురాలు దళారుల వద్ద రూ. 3,500 విలువైన శ్రీచక్రార్చన సేవ టికెట్‌ను కొనుగోలు చేయగా, అది నకిలీదని ఐటీ సిబ్బంది నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ఆన్‌లైన్ లేదా ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయలేదని స్పష్టం చేస్తూ, భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.