ప్రకృతి మిత్రుడిగా మట్టి వినాయకుడిని పూజిద్దాం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం త్రివేణి పాఠశాలలో ముందస్తు వినాయక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సహజసిద్ధ వస్తువులతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ప్రదర్శించారు. ప్రత్యేక పూజలు, నృత్యాలు, భక్తిగీతాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి పర్యావరణ పరిరక్షణపై చైతన్యం అవసరమని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు మట్టి వినాయకుడు మన ప్రకృతికి మేలు అంటూ పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.