బీజేపీలోకి సుంకరపాలెం మాజీ సర్పంచ్: అమలాపురంలో పార్టీ కండువా కప్పిన నేతలు

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: అమలాపురం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం మాజీ సర్పంచ్ తిల్లపూడి నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. మంగళవారం అమలాపురంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.