పరిషత్ నామినేషన్ల గడువు పెంపు లేదు: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువును పెంచే ఆలోచన లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి అంటే సాయంత్రం ఐదు గంటలకే నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తేల్చిచెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు కల్పించాలని ఎస్ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.