రోబోటిక్ ఫాల్కన్ తో పక్షుల బెడదకు చెక్ పెట్టిన పరిశోధకులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఇటలీ

పక్షుల గుంపులను తరిమికొట్టేందుకు పరిశోధకులు రోబోటిక్ ఫాల్కన్ ను విజయవంతంగా పరీక్షించారు. ఉత్తర ఇటలీలోని రెండు ప్రాంతాల్ లో ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు సైంటిస్టులు తెలిపారు. డేగను పోలి ఉండే ఈ రిమోట్ కంట్రోల్ రోబోట్ ద్వారా పావురాలను, గల్స్ పక్షులను సమర్థంగా పారదోలినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వినూత్న సాంకేతికత భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.