తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వివాదాల పరిష్కారానికి హైలెవెల్ కమిటీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఛైర్మన్గా, సభ్యులుగా పాపిరెడ్డి, రాజీవ్ గాంధీ హనుమంతుతో కూడిన ముగ్గురు సీనియర్ అధికారుల హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ భూ బాధితుల సమస్యలపై విధివిధానాలు ఖరారు చేయనుంది.