పీఎఫ్ ఖాతాదారుల కోసం కొత్త వాట్సాప్ ఛానల్ ప్రారంభం
రిపోర్టర్: సురేష్
స్థలం: India
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పీఎఫ్ సభ్యులు, పెన్షనర్ల కోసం అధికారిక వాట్సాప్ ఛానల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛానల్ ద్వారా పీఎఫ్ సంబంధిత ముఖ్యమైన అప్‌డేట్లు, తాజా సమాచారం నేరుగా మొబైల్‌కే అందనున్నాయి. బ్యాలెన్స్ చెకింగ్ వంటి వ్యక్తిగత సేవలు ఇందులో ఉండవని, ఫేక్ లింట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.