ముంపు సమస్య పరిష్కారం కోరుతూ గ్రామస్తుల జలదీక్ష
రిపోర్టర్: శివ
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కుయుగూరు గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ జలదీక్ష చేపట్టారు. ప్రతి ఏడాది వరదలతో తమ పంట పొలాలు మునిగిపోతున్నాయని, రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామం జాబితాలో చేర్చి వెంటనే శాశ్వత పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.