పెండింగ్ యూఎల్సీ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించి క్రమబద్ధీకరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం దీనిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు. 22-ఏ నిషేధిత భూముల చిక్కుముడులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ బాధితులకు వేగంగా ఊరట కలిగిస్తున్నామని, మిగిలిన అన్ని భూ వివాదాలను కూడా త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భరోసా ఇచ్చారు.