మనుబోలులో ఘనంగా గ్రామసభ: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

మనుబోలు మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభను నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశానికి అధికారి గరుడయ్య వ్యవహరించగా, ముఖ్య అతిథిగా డిఎల్పిఓ డాక్టర్ పుట్టా రమణయ్య హాజరయ్యారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మరియు అభివృద్ధి పనుల వివరాలను అధికారులకు వివరిస్తూ చర్చించారు.