అద్భుత ప్రతిభతో భగవద్గీతను కంఠస్థం చేసిన తొమ్మిదేళ్ల బాలుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: బెంగళూరు

బెంగళూరుకు చెందిన తొమ్మిదేళ్ల వృషవర్ధన్ శర్మ అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను పూర్తిగా కంఠస్థం చేసిన ఆయన, ఎనిమిదేళ్లకే సంస్కృత వ్యాకరణ గ్రంథమైన అష్టాధ్యాయితో పాటు అమరకోశాన్ని సైతం నేర్చుకుని జాతీయ బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా స్వయంగా కోడింగ్ నేర్చుకుని గీతవర్ధన్ యాప్‌ను రూపొందించడంతో పాటు, పదకొండు భారతీయ లీపులలో గీతను చేతితో రాసి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.