సాహిల్ మృతిపై పోరాటానికి మద్దతిస్తామన్న రాహుల్ గాంధీ

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిల్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆయన, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాహిల్కు న్యాయం జరిగే పోరాటంలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉన్నత విద్యాసంస్థల్లో వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు.