బాల్యాన్ని గుర్తుచేసే అద్భుతమైన చిత్రం సమ్మర్ హాలిడేస్ అంటూ కిరణ్ అబ్బవరం ప్రశంస

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

బాల్యాన్ని గుర్తుచేసే అద్భుతమైన చిత్రంగా సమ్మర్ హాలిడేస్ నిలుస్తుందని హీరో కిరణ్ అబ్బవరం ప్రశంసించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సినిమాలో నటించిన పిల్లల నటన అద్భుతంగా ఉందని, ఎక్కడా చిన్నపిల్లల సినిమాగా అనిపించదని ఆయన వెల్లడించారు. ఈనెల ఆరున విడుదల కానున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలని నిర్మాత ధీరజ్ మొగిలినేనిని ఆయన ఆకాంక్షించారు.