విశాఖలో రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: ఆర్థిక సాయం అందించిన పోలీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ఇటీవల హిట్ అండ్ రన్ ప్రమాదాల్ లో తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం మూడు లక్షల రూపాయల సాయం జమ చేసినట్లు VizagCityPolice వెల్లడించారు. ఇప్పటివరకు రోడ్డు ప్రమాద బాధితులైన రెండువందల ఇరవై ఐదు మందికి లక్షా అరవై ఐదు లక్షల పరిహారం ఇప్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.