దారి లేని పల్లెలో రోదిస్తున్న అడవితల్లి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగు పొంగిపొర్లుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాలన్నా సంతకు వెళ్లాలన్నా వాగు దాటాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు, వంతెన సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.